కలం, వెబ్ డెస్క్: రోజువారీ ట్రాఫిక్ జామ్‌లు, బిజీ లైఫ్‌స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బెంగళూరులో (Bengaluru) వింత సంఘటన చోటుచేసుకుంది. జూలై 7 సాయంత్రం ప్యాలెస్ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనదారులకు ఊహించని ఘటన ఎదురైంది. రద్దీగా ఉండే ఆ రోడ్డు మధ్యలోకి ఒక పెద్ద తాచుపాము వచ్చి చేరింది. దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు తన పడగ విప్పి రోడ్డుపైనే తిష్ట వేయడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. ఆ విషసర్పం కదలకుండా అక్కడే ఉండిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. బెంగళూరు ట్రాఫిక్ రూల్స్‌తో సంబంధం లేదు అన్నట్లుగా ఆ పాము వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాము వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘బెంగళూరు ట్రాఫిక్‌కు కొత్త వీఐపీ అతిథి దొరికారు. ప్యాలెస్ రోడ్డులో తాచుపాము ప్రత్యక్షమైంది’ అని రాశారు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘ఈ పాము సాయంత్రం వేళ ఒక 30 నిమిషాల ధ్యానం కోసం ఈ రోడ్డుపైకి వచ్చింది. ట్రాఫిక్ రూల్స్‌పై దానికి అసలు కేర్ లేదు’ అంటూ కామెంట్ చేశారు.
బెంగళూరు ప్యాలెస్ రోడ్లో నాగుపాము హల్చల్!
-రోడ్డు మధ్యలో పడగ విప్పి 30 నిమిషాల పాటు నాగుపాము ‘ధ్యానం’
-ట్రాఫిక్ జామ్ కావడంతో… రంగంలోకి దిగి సురక్షితంగా తరలించిన పోలీసులు
Bengaluru: Snake Deploys Full Hood, Shuts Down Palace Road Traffic#Bengaluru #PalaceRoad #SnakeOnRoad… pic.twitter.com/e992pm82XF— Kalam Daily (@kalamtelugu) July 8, 2026
Read Also: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎన్ని గంటలు నిద్రపోవాలి?
Follow Us On: Instagram

