రఘునాథపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీ

కలం, రఘునాథపల్లి: జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లి (Raghunathpalli) మండలం నిడిగొండ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఇసుక లారీ వేగంగా వెళ్లి పత్తి బెల్ల లారీని ఢీకొనడంతో రెండు వాహనాలు కిందపడిపోయాయి.

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>