కాంగ్రెస్ జపం చేయకుండా బీజేపీ బతకదు: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ జపం చేయకుండా బీజేపీ బతకదని సీఎం రేవంత్ (CM Revanth) విమర్శలు గుప్పించారు. రాజీన్ గాంధీని చంపిన వాళ్లకు కూడా సోనియా గాంధీ క్షమాభిక్ష పెట్టారని అన్నారు. బంగారం కొనొద్దు, విమానాల్లో ప్రయాణం చేయోద్దని చెప్పడం మోదీ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. విదేశీ విధానంలో మోదీ ప్రభుత్వ వైఫల్యం చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలను కప్పిపుచ్చుకోవడానికి మోదీ ఇలా ప్రజలకు పిలుపు ఇచ్చారని.. ఇది భాద్యతారాహిత్యమైనదని విమర్శించారు. రాహుల్ గాంధీ మొదటి నుంచి అదే చెపుతున్నారని అన్నారు. విదేశీ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రతిపక్షాల సూచనలను తీసుకోవాలని.. అఖిలపక్షాలను పిలిచి మాట్లాడాలని అన్నారు. కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు అని.. జెమిని సర్కస్ లా బీజేపీ ఎన్నికల విధానం ఉంటుందని తెలిపారు.

అనుభవరాహిత్యం, అహంకారం వల్లనే దేశాన్నిసంక్షోభంలోకి నెడుతున్నారని.. గాలిని తిని గాల్లో బతకమని మోదీ చెప్పిపోయారని విమర్శించారు. రైతులకు యూరియా కేంద్రం ఇవ్వాలని.. రాష్ట్ర ప్రభుత్వం పంచాలని చెప్పారు. కేరళలో 3 సీట్లు, తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుందని అన్నారు. ఎస్ఐఆర్ ను ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోందని విమర్శించారు. పశ్చిమబెంగాల్ లో 90 లక్షల ఓట్లను తొలగించారని చెప్పారు. ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ ఎస్ఐఆర్ ను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదని.. మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి ఏమిటీ? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ ను దేనికి సంబంధం లేకుండా అమలు చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయోచ్చని అభిప్రాయపడ్డారు.నియోజకవర్గాల పునర్విభజన 543 లోక్ సభ సీట్లను దామాషా ప్రకారం చేసేందుకు అవకాశం ఉందని వివరించారు.

డీలిమిటేషన్ 50 శాతం పెంపు అన్న దానికి కూడా ఫార్ములా లేదని సీఎం చెప్పారు. సీట్ల పెంపకంపైనే అందరికి అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. జమిలి ఎన్నికలు 2029లో పెట్టడానికి ఆస్కారం ఉందని చెప్పారు. బీజేపీకి ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదని.. అతి పెద్ద పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించాలన్నారు. గవర్నర్ చెప్పిన తేదీన బలనిరూపణ చేయించుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. బండి సంజయ్ కొడుకు అంశంపైన డీజీపీ,ఇతర అధికారులతో సమీక్ష చేశానని చెప్పారు. బండి సంజయ్ కొడుకు పైన పేట్ బషీరాబాద్ స్టేషన్ లో అమ్మాయి తల్లి ఫిర్యాదు చేశారని.. 8వ తేదీన సంజన్ కొడుకు పైన ఎఫ్ఐఆర్ నమోదు అయిందని చెప్పారు. అంతకు ముందే కరీంనగర్ లో బండి సంజయ్ కుమారుడు వాళ్ల పైన కేసు పెట్టాడని అన్నారు. 9,10 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన వల్ల 10 వేల మంది పోలీసులు భద్రతలో నిమగ్నమయ్యారని తెలిపారు. డీజీ నుంచి కింద స్థాయి అధికారుల వరకు అంతా ఈ భద్రతలోనే ఉన్నారని చెప్పారు. ఇప్పుడు విచారణ ప్రారంభమైందని.. పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అన్న విషయాన్ని మరిచిపోవద్దు అని విమర్శించారు. కేటీఆర్ బామ్మర్థి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుని దొరికినా వదలలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖాళీగా ఉన్నామని కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డ్యూటీ చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. అకాల వర్షాల కారణంగా కొన్ని ఇబ్బందులున్నాయని సీఎం తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. పంట మార్పిడిపైన విస్తృత చర్చ జరగాలని అభిలషించారు. క్షేత్రస్థాయిలో రైతులకు పంట మార్పిడిపైన వివరిస్తామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>