వైకల్యాన్ని ఎదిరించి.. కష్టాల కడలిని దాటి.. ఆదిలాబాద్ యువకుడి సక్సెస్ స్టోరీ!

కలం, ఆదిలాబాద్ బ్యూరో: గత ఇరవై ఏండ్లుగా కదలలేని స్థితిలో ఉన్న ఓ యువకుడు వైకల్యాన్ని ఎదిరించి డిజిటల్ మార్కెటింగ్‌లో రాణిస్తున్నాడు. ఒంటి చేతితో ఉద్యోగం చేస్తూ అందరికి స్పూర్తిగా నిలుస్తున్నాడు. అతడే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వెంకటరమణ. వైకల్యాన్ని ఎదిరించి అందరికీ స్పూర్తిగా నిలిచిన వెంకటరమణపై ప్రత్యేక కథనం. జిల్లా కేంద్రంలోని కైలాస్‌నగర్‌కు చెందిన సురేఖ, సంతోష్ దంపతుల పెద్ద కుమారుడు వెంకటరమణ. వెంకటరమణ తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వెంకటరమణ వయస్సు 27 సంవత్సరాలు.

చిన్నప్పుడే ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా (Osteogenesis Imperfecta – OI) అనే ఎముకల వ్యాధి రావడంతో వెంకటరమణలో ఎదుగుదల ఆగిపోయింది. వ్యాధిని నయం చేయించుకునేందుకు వెంకటరమణ తల్లిదండ్రులు చేయని ప్రయత్నాలు లేవు. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వ్యాధి నుంచి బయటపడలేకపోయాడు వెంకటరమణ. కానీ తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ నవజాత శిశువులా వెంకటరమణను పోషిస్తున్నారు. అయితే వెంకటరమణకు శారీరక ఎదుగుల లేకపోవడంతో బడికి వెళ్ల లేదు, అక్షరాలు దిద్దలేదు. చిన్నప్పుడు నాన్నమ్మ చార్ట్‌లతో అక్షరాలు నేర్పింది. రామయాణ, మహభారత కథలు చెప్పింది. పదవతరగతి ఓపేన్ పరీక్షలు స్క్రైబ్‌‌తో రాసి ఉత్తీర్ణత సాధించాడు వెంకటరమణ.

ఆన్‌లైన్ శిక్షణ పొంది.. శిక్షణ పొందిన సంస్థలోనే ఉద్యోగం సాధించిన యువకుడు

అయితే వైకల్యం ఉన్నా వెంకటరమణలో సాధించాలనే పట్టుదల మాత్రం పుష్కలంగా ఉండేది. ఆ ‌పట్టుదలతోనే ఆన్‌లైన్‌లో ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సును అధ్యయనం చేశాడు. ఆ పరిజ్ఞానంతోనే ఓ కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ లీడర్‌గా పని చేస్తున్నారు. మరొక కంపె‌నీకి స్ట్రాజిస్టుగా విధులు నిర్వహిస్తూ తన ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. అయతే వెంకటరమణ బల్లపై పడుకుంటాడు, ప్రక్కనే ఒక స్టాండ్‌కు ఫోన్ పెట్టుకుని ఒక చేతితో బ్రౌజింగ్ చేస్తూ గూగుల్ మీట్‌లో ‌మూడు వందల మందికి శిక్షణ ఇస్తున్నారు. ఇలా కదలలేని స్థాయి నుండి డిజిటల్ సేవలకు శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగి, నెలకు రూ. 50 వేలు సంపాదిస్తున్నాడు వెంకటరమణ.

టీవీలో క్రికెట్ కామెంట్రీ చూసీ ఇంగ్లీష్ నేర్చుకున్నా

సాధారణంగా డిజిటల్ మార్కెటింగ్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సిందే. కదల్లేని స్థితిలో ఉన్న వెంకటరమణకు ఇప్పుడు అద్భుతంగా ఇంగ్లీష్‌లో మాట్లాడే నైపుణ్యం ఉంది. అయితే కంపెనీ వ్యవహారాలన్నీ ఇంగ్లీష్‌లోనే ఉండటంతో తాను క్రికెట్ కామెంటరీ చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు తాను ఇంగ్లీష్‌లోనూ అనర్గళంగా మాట్లాడగలననీ, ఇతరులకు ఇంగ్లీష్‌లోనే వివరిస్తానని తెలిపాడు. కదల్లేని స్థితిలో ఉన్న కొడుకు ఉద్యోగంలో రాణించడంపై అతని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: నర్సింగ్ ఆఫీసర్‌లకు నియామక పత్రాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>