కలం, వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హోమ్ గార్డ్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో గాజల కరుణాకర్ రెడ్డి అనే హోంగార్డ్ పనిచేస్తూ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇంటి పక్కనే ఉండే గృహిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఒంటిమీద బట్టలు తొలగించి ఆమె ముందు నగ్నంగా ప్రదర్శన చేశాడు. బట్టలు ఆరేయడానికి మేడపైకి వెళ్ళినప్పుడల్లా ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సదరు మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై హోమ్ గార్డ్ పిచ్చి వేషాలకు బుద్ది చెప్పాలని అనుకుంది. ఈ తతంగం అంతా తన భర్తకు చెప్పడంతో.. కోపోద్రిక్తుడై అతడిని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని స్కెచ్ వేశారు. తన భార్య మేడపైకి వెళ్తుండగా.. హోమ్ గార్డ్ నగ్నంగా ఉండటాన్ని చూసి వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం బార్యాభర్తలిద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆధారాలతో ఫిర్యాదు చేశారు.
నగ్నంగా తన భార్య ముందుకువచ్చి మహిళలను లోబర్చుకునేందుకు వికృత చేష్టలకు పాల్పడ్డాడని.. హోమ్ గార్డ్ అయ్యుండి ఇంత కామపిశాచిలా చేయడం ఏంటని మండిపడ్డారు. ఈ దుర్మార్గుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని వేషాలపై భార్య చెప్పడంతో రహస్యంగా ఫోటోలు తీసినట్లు వివరించారు. కరుణాకర్ రెడ్డి తాము ఉంటున్న ఇంటి పక్కన ఓ గదిని అద్దెకు తీసుకుని కొంతకాలంగా ఉంటున్నాడని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో గజ్వేల్ పోలీసు స్టేషన్ లో కరుణాకర్ రెడ్డిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

