కలం, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పలు దేశాల్లో సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో గ్యాస్(Gas), పెట్రోల్(Petrol), యూరియా(Urea)నిల్వలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే గ్యాస్ కొరత వేధిస్తుండగా, పెట్రోల్ కొరత భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై సమీక్ష చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.
Read Also: రాష్ట్రంలో ఇంధన కొరత.. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
Follow Us On: Instagram

