కలం, తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ (Global Summit) మొదటి రోజున (డిసెంబరు 8)న 15 గ్రూపుల ప్రతినిధులతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశం కానున్నది. తొలి రోజునే కొరియా డిప్యూటీ మినిస్టర్ నేతృత్వంలో హ్యుండయ్ (Hyundai), ఎల్ఎస్‌జీ (LSG), సీజీ (CG) గ్రూపుల ప్రతినిధులు తెలంగాణ టీమ్‌తో చర్చించనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల విషయమై చర్చిస్తారు. కొరియా తెలిగేషన్‌లో దావోస్ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించిన చుక్కపల్లి సురేశ్ కూడా పాల్గొంటున్నారు. విన్ గ్రూప్(Vingroup), ఈఎస్ఆర్ (ESR) గ్రూపు, సెంబ్‌కార్ప్ (Sembcorp), ఐకియా (IKEA), సీఐబీసీ, ప్రెస్టీజ్, అపోలో, మైక్రాన్ ఇండియా, లండన్ యూనివర్శిటీ తదితర సంస్థల ప్రతినిధులు కూడా తెలంగాణ టీమ్‌తో చర్చలు జరపనున్నారు.
సెమినార్లు, వరుస భేటీల సందడి :
గ్లోబల్ సమ్మిట్ డిసెంబరు 8న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్లీనరీ హాల్‌లో లాంఛనంగా ప్రారంభం కానున్నది. ఆ రోజు రాత్రి ఏడు గంటల వరకు వేర్వేరు దేశాలు, కంపెనీల నుంచి వచ్చే ప్రతినిధులతో ప్రత్యేకంగా తెలంగాణ టీమ్ సమావేశమవుతుంది. ఫ్యూచర్ సిటీలో కొత్త యూనిట్లను నెలకొల్పడం, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడంపై ఈ సమావేశాల్లో చర్చలు జరగనున్నాయి. రాబోయే రెండు దశాబ్దాల్లో తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు రూపొందించిన వ్యూహాన్ని తెలంగాణ టీమ్ ఈ ప్రతినిధులకు వివరిస్తుంది. ఐటీపీ ఏరో స్పేస్, సోలార్ గ్రూప్, జీఎంఆర్, అపోలో మైక్రో సిస్టమ్స్, ఫుడ్ లింక్స్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ తదితర సంస్థల ప్రతినిధులతో ఒకవైపు విడిగా భేటీ అవుతూ, మరోవైపు వివిధ అంశాలపై జరిగే సెమినార్లలో తెలంగాణ టీమ్ తరఫున మంత్రులు, అధికారులు వివరిస్తారు.
రెండో రోజున 20 కంపెనీలతో భేటీలు :
తొలిరోజు తరహాలోనే రెండో రోజు (డిసెంబరు 9)న కూడా దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ సీఎం, మంత్రులు సమావేశమవుతారు. వైపీఓ (YPO), వై-యాక్సిస్ (Y-Axis), బీఎండబ్ల్యూ (BMW), థింక్ కాపిటల్ (Think Capital), నెట్‌ఫ్లిక్స్ (Netflix), ఈఎస్ గ్లోబల్ (ES Global), సింగపూర్‌కు చెందిన ఏజీఐడీసీ (AGIDC), ఎంఎస్ఎన్ ఫార్మా, బయోలాజికల్-ఈ, సైమన్, విన్‌స్టన్, క్వాడ్‌జెన్, సూపర్ క్రాస్, ఫిజిక్స్ వాలా, మహింద్రా (Mahindra), జీఎంఆర్ స్పోర్ట్స్ తదితర సంస్థల ప్రతినిధులు కూడా తెలంగాణతో చర్చల్లో గ్లోబల్ సమ్మిట్(Global Summit)లో పాల్గొననున్నారు. అనంతరం వీరందరికీ గ్రాండ్‌గా విందు కూడా కల్పించనున్నారు.
ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఫిజికల్‌గా హాజరు కాలేని కారణాలతో వర్చువల్‌గా హాజరవుతున్నారు. మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సీఈఓ శైలేష్ జెజురీకర్, నీతీ ఆయోగ్ సీఈఓ బీవీఎఆర్ సుబ్రమణ్యం తదితరులు వర్చువల్‌గా పాల్గొంటున్నారు.
Read Also: హైదరాబాద్ రేంజ్ లో వరంగల్ అభివృద్ధి : రేవంత్
Follow Us On: X(Twitter)


