కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జాతీయ రాజకీయాల్లోనూ తన ప్రభావం చూపుతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయబోతున్నారు. ఈ మేరకు గోవాలోని పోండా ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆయన దూకుడును ప్రచార అస్త్రంగా వాడుకోవాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి త్వరలోనే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం భారీ బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు.
Read Also: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మంచులక్ష్మి భేటీ.. కారణమేంటి?
Follow Us On: Sharechat

