కలం, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar)తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు పలుమార్లు బలవంతంగా గర్భస్రావం చేయించారని బాధితురాలు హర్ష వీణ ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న జనసేన కమిటీ నిర్ణయం వెలుగులోకి రాక ముందే పార్టీ కార్యక్రమాల్లో శ్రీధర్ పాల్గొనడంపై బాధితురాలు ప్రశ్నలు గుప్పిస్తోంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా నెట్టింట మరో సంచలన వీడియో రిలీజ్ చేశారు. తనకు ఆత్మహత్యే శరణ్యమని హర్ష వీణ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా తాను చిన్నప్పటి నుంచి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను చూస్తూ పెరిగానని.. తన అమ్మ, నాన్న లాగానే ఆయనను కూడా ఫ్యామిలీ మెంబర్ గా అనుకున్నానని వెల్లడించారు. ఇప్పుడు ఆయన కూడా తనకు న్యాయం చేయకపోతే.. జనసేన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తనకు అన్యాయం చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై (Arava Sridhar) ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని వాపోయారు. బాధితురాలు అయిన తాను మాత్రం జనాల్లో తిరగలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ రిలీజ్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ అంశం ఏపీ వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశం అవుతోంది.
Read Also: రఘురామపై దాడి వెనుక కుట్ర కోణం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

