కలం, వెబ్ డెస్క్ : SIR ప్రక్రియ పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన మీడియా కాంక్లేవ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి మాట్లాడారు. బ్రిటీష్ వాళ్లు సైమన్ కమిషన్ ను వాడుకున్నట్లే నేడు బీజేపీ ‘సర్’ అదే విధంగా ఉపయోగించుకుంటుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బ్రిటీష్ జనతా పార్టీలా బీజేపీ మారిందని ఆయన ధ్వజమెత్తారు.
భారత స్వాతంత్య్రోద్యమంలో సైమన్ గో బ్యాక్ నినాదంతో పోరాడారని.. ఇప్పుడు కాంగ్రెస్ ‘సర్’ గో బ్యాక్ నినాదంతో ఉద్యమం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ నీటి సమస్యలు పరిష్కరించడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని.. 13 ఏళ్లుగా నీటి సమస్యలు అలానే ఉన్నాయని రేవంత్ ఆరోపించారు. అలాగే, విభజన అంశాలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయని విమర్శించారు. మెట్రో రైల్ విస్తరణకు, RRR ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.

