ప్రజాసేవే పరమావధి.. నగర అభివృద్ధికి కట్టుబడి ఉంటా: సునీల్ రావు

కలం, ​కరీంనగర్: పార్టీ కార్యకర్తల ప్రోత్సాహం, ప్రజల ఆశీస్సులే తనకు కొండంత బలమని, ప్రజాసేవే పరమావధిగా రాబోయే రోజుల్లో నగర సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, కరీంనగర్ డిప్యూటీ మేయర్ (Karimnagar Deputy Mayor) యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) పునరుద్ఘాటించారు.

​తన జన్మదిన వేడుకల సందర్భంగా భగత్ నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నగర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ముందుంటానని స్పష్టం చేశారు. ​

తనపై ఎనలేని ప్రేమను కురిపించి, జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, అభిమానులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నగర పురోగతి కోసం అందరినీ కలుపుకొని నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>