దయారాం జాతవ్‌కు జాతీయ స్థాయిలో కీలక పదవి

కలం, వెబ్ డెస్క్: యూపీలోని దళిత్ ఇండస్ట్రీయల్ అసోసియేషన్ అధ్యక్షుడు దయారాం జాతవ్‌కు (Daya Ram Jatav) కేంద్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఆయన్ను కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఎస్సీ, ఎస్టీ అడ్వైజరీ బోర్డుకు ఛైర్మన్‌గా నియమించింది. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగుతూ వచ్చిన మిలింద్ కాంబ్లీని తొలగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు వారికి సంబంధించిన కార్యక్రమాలు అమలు జరిగేలా పర్యవేక్షిస్తుంటుంది. ఈ కమిటీలో మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు మరికొందరు నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు. వీరి పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది.

సమస్యల పరిష్కారానికి కృషి..

నూతన ఛైర్మన్‌‌ దయారాం జాతవ్ మాట్లాడుతూ.. తనను ఈ పదవికి ఎంపిక చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ హబ్ ద్వారా ఇస్తున్నస్పెషల్ క్రెడిట్ లింక్డ్ కాపిటల్ సబ్సిడీని 25 నుంచి 45 శాతానికి పెంచేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అభివృద్ధికీ కృషి చేస్తానన్నారు. పరిశ్రమల స్థాపనలో వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు. అలాగే, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మార్కెటింగ్, ఇతర పారిశ్రామిక అవకాశాలను జాతీయ స్థాయి వేదికపై ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. తనకు అవకాశం కల్పించేలా చొరవ తీసుకున్న దళిత్ ఇండస్ట్రీయల్ అసోసియేషన్ వ్యవస్థపాక అధ్యక్షుడు డాక్టర్ మామిడి సుదర్శన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>