Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఢిల్లీలోనే ఉంటా’.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి లేఖ రాశారు. తాను సోమవారం, మంగళవారం ఢిల్లీలోనే ఉంటానని.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని కోరారు. హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రాజెక్ట్ పెండింగ్ అంశాలపై చర్చించాలన్నారు. జూన్ 16న తాను రాసిన లేఖను ప్రస్తావిస్తూ IRFC ఫైనాన్సింగ్ సమస్యల పరిష్కారంతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్ర సహకారం అవసరమని పేర్కొన్నారు.

రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయిస్తే అన్ని ఒప్పందాలు, వాస్తవాలు, అవసరమైన పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ అంశాలు త్వరగా పరిష్కరించాలని కిషన్ రెడ్డిని (Kishan Reddy) కోరారు.

Read Also: నీట్ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ది బెస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>