కలం, నిర్మల్ : ముధోల్ (Mudhole) నియోజకవర్గం పరిధిలోని 35 గ్రామాల్లో రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణానికి రూ.10.50 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) శనివారం తెలిపారు. రైతులు తమ పంటలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఒక్కో గ్రామంలో ఒక గోదామును రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఈ గోదాముల నిర్మాణం ద్వారా రైతులకు నిల్వ సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ నిధులు విడుదలైనట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యం, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గోదాములను నిర్మించనున్నట్లు తెలిపారు.
Read Also : గర్భిణీ మృతితో చర్చనీయాంశంగా ప్రభుత్వాసుపత్రులు
Follow Us On: Instagram

