epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మొంథా తుపాను.. కలెక్టర్లకు రేవంత్ కీలక ఆదేశాలు..

మొంథా తుపాను(Cyclone Montha) ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) దృష్టి పెట్టారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ‘‘ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలి. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్స్ హాల్స్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలి.

ప్రతీ ధాన్యంకొనుగోలు కేంద్రం నుంచి ప్రతీ 24 గంటల పరిస్థితిపై ప్రతీరోజు కలెక్టర్ కు రిపోర్ట్ అందించాలి. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరు ఫీల్డ్ లో ఉండాల్సిందే. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఒక మానీటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానీటర్ చేస్తూ ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలి. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలి. అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలి’’ అని Revanth Reddy తెలిపారు.

Read Also: ‘అజారుద్దీన్‌కు మంత్రి పదవా.. నాకు తెలీదే..!’

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>