Mobile Popup Ad
Mobile Popup Ad

‘కొడుకును విచారణకు పంపండి’.. బండి సంజయ్ కు సీఎం సూచన

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  స్పందించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడన్న సీఎం.. తక్షణమే బండి సంజయ్ (Bandi Sanjay) తన కొడుకును తీసుకుని వచ్చి విచారణను ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కీలకమైన హోదాలో ఉండి హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత సంజయ్ పై ఉందని, తనకు తానుగా ఆయన కొడుకును విచారణకు అప్పగించాలని కోరారు.

బాధితులకు అండగా ఉంటాం..

బండి భగీరథ్ (Bandi Bhagirath) కేసులో బాధితులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసు వ్యవహారాలపై సీఎం వివరించారు. ” ఈ నెల 8న బాధిత మహిళ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ప్రధాని రావడంతో పోలీసులు ఆ బందోబస్తులో ఉన్నారు. 11న మళ్ళీ అమ్మాయి నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే ఫోక్సో కేసు నమోదైంది. మాకు ఎవరైనా ఒక్కటే. నేరస్థుడిని శిక్షించే బాధ్యత నాది. తల్లి ఫిర్యాదు కంటే మైనర్ అమ్మాయి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసును నిర్లక్ష్యం చేయడం లేదు” అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.

దీనిపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని, గడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పి ఆ గడీల కోసం ఇప్పుడు పని చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. అయితే బండి సంజయ్ కొడుకు మీద కేసు నమోదు అయితే బండి సంజయ్ ను అరెస్ట్ చేయాలా? అని సీఎం ప్రశ్నించారు. అమ్మాయి సర్టిఫికెట్లు సేకరించామని తెలిపారు. ఆధారాలు సేకరించామని, ఆధారాలు దొరికితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. హడావిడిగా.. తనపై కేసీఆర్ కేసు పెట్టినట్లు మేం తొందరపాటు చర్యలు తీసుకోలేదని అన్నారు. బండి సంజయ్ కాదు.. ఎవరైనా తాము బాధితులకు న్యాయం చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

Read Also: తిట్టినా ప‌ట్టించుకోను.. ఆక్ర‌మ‌ణ‌లు తొలగిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>