కలం మెదక్ బ్యూరో: ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి మృతిచెందిన ఘటన మెదక్ (Medak) జిల్లాలో చోటుచేసుకుంది. మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన జల నంద కిషోర్ (15), భాను (15) ఈత కొట్టేందుకు హకీంపేట గ్రామ శివారులో ఉన్న క్వారీ గుంత వద్దకు వెళ్లారు. ఈత కొట్టే క్రమంలో లోతైన నీటి గుంతలో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో మాసాయిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

