Mobile Popup Ad
Mobile Popup Ad

షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో సోనం మస్కర్‌కు స్వర్ణం

కలం, వెబ్ డెస్క్: భోపాల్ వేదికగా జరుగుతున్న 24వ కుమార సురేంద్ర సింగ్ మెమోరియల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో రైల్వేస్ క్రీడాకారిణి సోనమ్ ఉత్తమ్ మాస్కర్ (Sonam Maskar) సత్తా చాటారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని ముద్దాడారు. మధ్యప్రదేశ్ షూటింగ్ అకాడమీలో జరుగుతున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న షూటర్లు హోరాహోరీగా తలపడుతున్నారు.

ఈ టోర్నీలో అత్యంత ఆసక్తికరంగా సాగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో సోనమ్ 252.1 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. గుజరాత్‌కు చెందిన ప్రముఖ షూటర్ ఇలవేనిల్ వలరివన్ 251.7 పాయింట్లతో వెండి పతకాన్ని దక్కించుకోగా, మహారాష్ట్రకు చెందిన ఆర్య బోర్సే కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో మహారాష్ట్రకు చెందిన శాంభవి 633.9 పాయింట్లతో టాప్‌లో నిలిచినప్పటికీ, ఫైనల్లో మాత్రం సోనమ్ (Sonam Maskar) పైచేయి సాధించారు.

జూనియర్ విభాగం: జూనియర్ మహిళల కేటగిరీలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన తిలోత్తమ సేన్ 253.4 పాయింట్లతో టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

యూత్ విభాగం: కర్ణాటకకు చెందిన సాన్వి ఆర్‌పి 251.2 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించగా, పంజాబ్‌కు చెందిన ఓజస్వి ఠాకూర్ రజతంతో సరిపెట్టుకున్నారు.

టీమ్ ఈవెంట్: 10 మీటర్ల రైఫిల్ మహిళల టీమ్ విభాగంలో మహారాష్ట్ర జట్టు ప్రథమ స్థానంలో నిలిచి పసిడిని గెలుచుకుంది. రైల్వేస్ జట్టు రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి.

సబ్ యూత్ విభాగంలో మహారాష్ట్రకు చెందిన అరిక్త సింగ్ విజేతగా నిలవగా, మాస్టర్స్ విభాగంలో వెటరన్ షూటర్ తేజస్విని సావంత్ తన అనుభవాన్ని చాటుతూ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. డెఫ్ మహిళల విభాగంలో చండీగఢ్‌కు చెందిన మహిత్ సంధు అగ్రస్థానంలో నిలిచారు.

Read Also: తిట్టినా ప‌ట్టించుకోను.. ఆక్ర‌మ‌ణ‌లు తొలగిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>