Mobile Popup Ad
Mobile Popup Ad

అసెంబ్లీలో సన్న బియ్యంతో లంచ్.. సీఎం సూచన

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీలో సన్నబియ్యంతో లంచ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వరి దిగుబడి, సన్నబియ్యం పంపిణీపై సీఎం మాట్లాడారు. వరి పంటలో దేశంలోనే అత్యధిక దిగుబడి సాధించిన రికార్డును తెలంగాణ రైతాంగం సృష్టించిందని రేవంత్‌రెడ్డి అన్నారు. అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని, 1.06 కోట్ల కుటుంబాలకు చెందిన సుమారు 3.46 కోట్ల మంది ప్రజలు ఈ బియ్యాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం కొత్త రేషను కార్డులను ఇవ్వలేకపోయిందని, ఇప్పుడు ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

సన్న బియ్యాన్ని తింటున్న ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అదే సన్న బియ్యంతో ఇక్కడ కూర్చున్న ఎమ్మెల్యేలందరికీ లంచ్ ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించారు. రైతుల్ని బాగు చేయడం కోసం తీసుకొస్తున్న ప్రణాళికలో భాగమే ‘రేర్’ (RARE) విజన్ ఎకానమీ అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం దూర దృష్టితో క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) పేరుతో గ్రేటర్ హైదరాబాద్ కోర్ రీజియన్‌ను, సెమీ అర్బన్‌గా ఉండే ప్రాంతాన్ని, పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించుకొన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వివరించారు.

Read Also: గత ప్రభుత్వ పారిశ్రామిక భూములపై ఎంక్వయిరీ : సీఎం

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>