ఏఐ సునామీతో ఉద్యోగాలు ఊస్ట్.. ఏటీసీలతో భరోసా

కలం, తెలంగాణ బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఏఐ టెక్నాలజీ (AI Technology) విస్తృతమవుతున్నదని, ఆ కారణంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు పోతున్నాయనే ఆందోళన నెలకొన్నదని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి ఏటా లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇబ్బందులకు ఉపాధి అవకాశాలపై అనుమానాలు ఉన్నాయన్నారు.

ఉపాధి అవకాశాలకు అనుగుణంగా మన యువత టెక్నికల్‌గా అప్‌డేట్ కాకపోతే కష్టమేనని అన్నారు. అందుకే స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రత్యేకంగా యూనివర్శిటీని పెట్టిందన్నారు. ఐటీఐలతో పాటు పాలిటెక్నిక్ విద్యా సంస్థల్లో సిలబస్‌ను అప్‌డేట్ చేస్తున్నామన్నారు. టాటా సంస్థ టెక్నికల్, అకడమిక్ సాయంతో రాష్ట్రంలోని ఐటీఐలను తీర్చిదిద్ది వాటిని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామన్నారు.

ఏఐ సునామీతో వైట్ కాలర్ జాబ్‌లు పోతే బ్లూ కాలర్ జాబ్‌లు సృష్టించాల్సిందేనని, అందుకోసమే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యారంగంలో సమూల మార్పులు చేయాల్సి వస్తున్నదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. నిరుద్యోగం పెరిగితే అది సమాజంలో అశాంతికి కారణమవుతున్నదని, అందువల్లనే ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల స్థాపనపై దృష్టి పెడుతున్నాని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి పక్కా ప్రణాళికను రూపొందించామన్నారు.

Read Also: పరాభవ నామ సంవత్సరం: పేరు విని భయపడొద్దు..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>