కమల నెహ్రూ ఆసుపత్రిని సందర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్

కలం నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ నందికొండ (Nandikonda) మున్సిపాలిటీ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాజా ప్రసాద్ (Raja Prasad) సందర్శించారు, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ హరికృష్ణతో రోగులకు అందించే మందులు, డ్యూటీ డాక్టర్ల సమయపాలనపై సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ఎటువంటి వదంతులను నమ్మవద్దని ఆసుపత్రిలో ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావలసిందిగా సూచించారని, అలాగే రోగులకు నాణ్యమైన వైద్యం అందించవలసిందిగా కోరారని తెలిపారు, ప్రతిపక్ష పార్టీలు నిరాదరణ ఆరోపణలు చేయవద్దని, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని వచ్చే ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్తారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ చైర్మన్ ముఖ్య సలహాదారుడు సుమన్, ఆరో వార్డు కౌన్సిలర్ చందు లాల్ నాయక్, ఒకటో వార్డు కౌన్సిలర్ సలహాదారుడు రాజగోపాల్ రెడ్డి, నాలుగో వార్డ్ కౌన్సిలర్ సలహాదారుడు మంద గౌతమీ రఘువీర్ బిన్నీ, ఏడో వార్డు కౌన్సిలర్ సలహాదారుడు వెంకటేశ్వర్లు, పదవ వార్డు కౌన్సిలర్ సలహాదారుడు రాజేష్, హాస్పిటల్ సీఎంవో హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>