ప్రభుత్వ సేవల నుంచి వెంకట్రామిరెడ్డి డిస్మిస్

కలం, వెబ్ డెస్క్ : ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి(Venkatarami Reddy) ని ప్రభుత్వ సేవల నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణల నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సమగ్ర విచారణ అనంతరం సమర్పించిన నివేదిక ఆధారంగా డిస్మిస్ ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే గత రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న వెంకట్రామిరెడ్డిపై తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆయన ప్రభుత్వ సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించబడ్డారు. దీంతో ఆయనకు రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కోల్పోనున్నారు. ఏపీ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన వెంకట్రామిరెడ్డి  వ్యవహారం గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ కేసుకు ముగింపు పడింది.

Read Also: జీవన్ రెడ్డికి కీలక పదవి.. ప్రకటించిన కేసీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>