కలం, ఖమ్మం బ్యూరో: కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పినరయ్ విజయన్ పట్ల చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఐ ఖమ్మం (Khammam) జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కేరళ సీఎం విజయన్ను మోడీతో పోల్చారని మండిపడ్డారు. బలమైన సిద్ధాంతాలతో పనిచేసే ఎల్డీఎఫ్ పై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్లో వామపక్షాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి ఈ విషయాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అధికారం కోసం దిగజారుడు ప్రచారం తగదన్నారు. పనిచేసే నేతలపై విమర్శలు చేసి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని మండిపడ్డారు.
Read Also: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర ముంచుకొస్తుందా.. అయితే బీఅలర్ట్
Follow Us On: X(Twitter)

