కలం, వెబ్ డెస్క్: సాధారణంగా సంక్రాంతి (Sankranti) పండుగకు సామాన్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అధికారిక కార్యక్రమాలకు గుడ్ బై చెప్పి ఆనందంగా గడుపుతుంటారు. కుటంబసభ్యులు, బంధుమిత్రులతో పండుగను జరుపుకుంటారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సెలవ్ తీసుకోకుండా అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. జనవరి 15న సంక్రాంతి సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి భారత సైన్యం ప్రతినిధులను కలిశారు.
ఈ సమావేశంలో భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య భూ సంబంధిత, ఇతర పరిపాలనా సమస్యలపై చర్చలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth Reddy) సీనియర్ ఆర్మీ అధికారుల ముందు అనేక విజ్ఞప్తులు ఉంచారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అవకాశాన్ని పరిశీలించాలని అభ్యర్థించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు రెండు నుండి నాలుగు సైనిక్ పాఠశాలలు కేటాయించగా, గత పదేళ్లుగా తెలంగాణకు ఒక్క సైనిక్ పాఠశాల కూడా మంజూరు కాలేదని ఎత్తి చూపారు.
ఇతర అధికారులు, మంత్రులు తమ ఇళ్లలోనే సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోగా, రేవంత్ తన బాధ్యతలకే పరిమితమయ్యారు. సీఎంగా ఎన్నికైన తర్వాత ఒక్క రోజు కూడా సెలవు (Leave) తీసుకోలేదని రేవంత్ ఇటీవల ఎత్తి చూపడంతో ఈ విషయం మరోసారి రుజువైంది. ఈ స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో ఆయన సమర్థత కనిపిస్తోంది.


