epaper
Monday, March 2, 2026
epaper

ప్రియుణ్ని చంపి, పార్టీ చేసుకున్న టీవీ నటి

కలం, వెబ్​ డెస్క్​: సహజీవనం చేస్తున్న ప్రియుణ్ని దారుణంగా నరికి చంపిందో నటి(Urmila Alias Bindu). హత్య చేసేటపుడు అరుపులు బయటకు వినిపించకుండా నోటిని టేప్​తో చుట్టి మరీ ఈ ఘాతుకానికి పాల్పడింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ పక్కింటి నుంచి దుర్వాసన వస్తోందంటూ మంజునాథ్​ నగర్​కు చెందిన ఓ కుటుంబం స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ఇంటికి వెళ్లి చూడగా, మోహన్​ కృష్ణ రావు(40) మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. కాళ్లూ చేతులు కట్టేసి, నోటికి టేపు చుట్టి, నగ్నంగా చేసి, కత్తులతో విచక్షణారహితంగా పొడిచినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. మోహన్​ కృష్ణ రావుతో సహజీవనం చేస్తున్న టీవీ, సినిమా నటి ఊర్మిళ అలియాస్​ బిందు కనిపించడం లేదని గుర్తించారు. వెంటనే సెర్చ్​ చేసి ఆమెతోపాటు వినయ్​, ధనుష్​ గౌడను అరెస్ట్​ చేశారు. విచారణలో వాళ్లు నేరాన్ని అంగీకరించారు.

కాగా, భార్యను వదిలిపెట్టిన మోహన కృష్ణ కొంతకాలంగా బిందుతో (Urmila Alias Bindu) సహజీవనం చేస్తున్నారు. అయితే, ఇటీవల ఆమెకు స్థానికంగా ఉండే లారీ డ్రైవర్​ వినయ్​తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో వినయ్​ని పెళ్లి చేసుకోవాలనుకున్న బిందు.. విషయాన్ని మోహన కృష్ణకు చెప్పింది. అతను అంగీకరించకపోవడంతో వినయ్​, ధనుష్​ గౌడతో కలసి గత నెల 18న  దారుణంగా హత్య చేసింది. అనంతరం పరారైంది. ప్రియుణ్ని దారుణంగా హత్య చేసిన ఆమె అదే రోజు రాత్రి పబ్​లో పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Read Also: పరుగులు చేయలేకపోతే తప్పుకోవాల్సిందే.. అభిషేక్‌పై నాయర్ హాట్ కామెంట్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!