రేవంత్ రెడ్డి జిల్లాల బాట: రేపటి నుంచే పర్యటనలు

కలం, వెబ్‌ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) రేపటి నుంచి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత కార్యక్రమాలను ఆయన ప్రారంభించబోతున్నారు.

అదేవిధంగా త్వరలో జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ పర్యటనల సందర్భంగా ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. పరిపాలనను మరింత వేగవంతం చేస్తూ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పర్యటనలు సాగించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>