Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీలో భిన్న వాతావరణం.. హై అలర్ట్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణం (AP Weather) నెలకొంది. పలు జిల్లాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండలతో పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది.

మరో రెండు రోజులు..

మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. ఏపీలోని 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ముఖ్యంగా పోలవరం, కాకినాడ ప్రాంతాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వివరించింది. పలు చోట్ల 43 – 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. అటు దక్షిణ ఏపీలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని, విభిన్న వాతావరణంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>