కలం, కరీంనగర్ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ TNGO (Karimnagar TNGOs) జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘం కమ్యూనిటీ హాల్ ఆవరణలో TNGOs జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయీస్ JAC చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి మాట్లాడారు. 1947 ఆగస్టు 15న లభించిన స్వాతంత్య్రం ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల వచ్చినది కాదని, ఎందరో అమరవీరుల రక్తతర్పణం, జైలు జీవితం, త్యాగాల ఫలితమే ఈ మువ్వన్నెల జెండా అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో TNGOs జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, TGOల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మడిపల్లి కాళీచరణ్ గౌడ్, అరవింద్ రెడ్డి, లక్ష్మీనరసింహారావు, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, సర్దార్ అర్మేందర్ సింగ్, రాగి శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, ఒంటెల రవీందర్ రెడ్డి, ఒంటెల ప్రసాద్ రెడ్డి, గంగారపు రమేష్, రాజేష్ భరద్వాజ్, శారద, సునీత, సరిత, సుస్మిత, భాస పవన్, కోట రామస్వామి, శంకర్, పెండ్యాల కేశవరెడ్డి, లింగయ్య జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు, పోలు కిషన్, మామిడి రమేష్, శంషుద్దీన్, శ్రీనివాస్ జీవన్ లవకుమార్, శ్రీమాన్ రెడ్డి, కమలాకర్, హస్గర్, కరుణాకర్, వేముల రవీందర్ రాజేశ్వరరావు నారాయణ, అల్లే శ్రీనివాస్, లక్ష్మీకాంతయ్య శశిధర్ తదితర ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

