స్మార్ట్ రేషన్ కార్డులపై మోడీ ఫోటో ఉండాల్సిందే: ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉండాల్సిందేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana ) డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో శనివారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులకు రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో అత్యధికంగా కేంద్ర వాటా ఉందని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రధాని మోడీ ఫోటో వేయకపోవడం తగదన్నారు. అలాగే జిల్లాలో అనేకచోట్ల బియ్యం పక్కదారి పడుతుందని వాటిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>