కలం, వెబ్‌డెస్క్: 2027 వరకు గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)లో ఆర్టీసీ 3 వేల ఈవీ బస్సులను (EV Buses )నడుపుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న వే టూ న్యూస్ కాన్ క్లేవ్ 2026లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈవీ బస్సులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం వెయ్యి ఈవీ బస్సులను కొనుగోలు చేసినట్లు సీఎం వెల్లడించారు.
ఆర్టీసీకి ఈవీ బస్సులతో ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఆర్టీసీ ప్రతి నెలా రూ.2 వేల కోట్ల విలువైన డీజిల్ వినియోగిస్తున్నట్లు సీఎం తెలిపారు. దశల వారీగా ఆర్టీసీ ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తుందని స్పష్టం చేశారు. మొత్తంగా వచ్చే ఏడాది వరకు 3 వేల ఈవీ బస్సులు నగరంలో వినియోగంలోకి వస్తాయని రేవంత్ రెడ్డి (CM Revanth) వెల్లడించారు.
Read Also: తెలంగాణ రియల్ ఎస్టేట్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat

