epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జిల్లాల మార్పుపై సీఎం క్లారిటీ

కలం, వెబ్​డెస్క్​: జిల్లాల మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన (District Reorganisation) పై కమిషన్​ వేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. గతంలో నాయకులకు నచ్చినట్లుగా జిల్లాల విభజన జరిగిందన్నారు. దాన్ని సరిదిద్దే బాధ్యత తమపై ఉందని చెప్పారు. సోమవారం ప్రజాభవన్​ వేదికగా విలేకరులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘గతంలో అర్థం పర్థం లేకుండా, అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగింది. ఆ లోపాన్ని, పొరపాటును సరిదిద్దాల్సి ఉన్నది. దీనికోసం ప్రత్యేక కమిటీ వేసి మార్పులు, చేర్పులు చేస్తాం. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్​ జడ్జితో కమిషన్​ వేస్తాం. మాజీ అధికారులూ ఇందులో ఉంటారు. జిల్లాల సంఖ్య పెంచడమా, తగ్గించడమా అన్నది కాదు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగాల్సిన అవసరం ఉన్నది.

ఇప్పటికే అభ్యంతరాలు వచ్చాయి. నాయకులకు నచ్చినట్లుగా అప్పట్లో విభజన జరిగింది. ఐదు మండలాలతో ఒక జిల్లా పరిషత్​ ఏర్పాటైంది. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా సరిహద్దులు ఫిక్స్ అవుతాయి. విధాన నిర్ణయానికి ముందు అసెంబ్లీ వేదికగానే అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటాం’ అని సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. అలాగే సికింద్రాబాద్​ అంశంపైనా సీఎం స్పందించారు. ‘సికింద్రాబాద్​ పేరును నేనేం ముట్టుకోలేదు కదా? ఆ పేరును నేను ఎక్కడ తీసేశాను?’ అని ప్రశ్నించారు. సికింద్రాబాద్​ జీహెచ్​ఎంసీలోనే ఉందని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్​ పేరు, మేడ్చల్​–మల్కాజ్​గిరి పేరు తాను పెట్టలేదన్నారు. రాజును తలపించేలా రాచకొండ పేరు ఉందన్నారు.

Read Also: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు నేనే పరిష్కరిస్తా : సీఎం రేవంత్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>