అసెంబ్లీకి రండి.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్

కలం, వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నామని, హరీశ్ రావు, కేటీఆర్ కేసీఆర్‌ను తీసుకొని సభకు వస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సవాల్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో జరుగుతున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆస్తి ఎక్కడ ఇవ్వాల్సి వస్తోందనని సొంత చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన చరిత్ర కేటీఆర్‌కు ఉందన్నారు. కేసీఆర్ పాలనలో ఒక్క మహిళకు కూడా మంచి జరగలేదన్నారు. ఇద్దరు మహిళలకు మంత్రులను చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు.

నిరుద్యోగులు మోసపోవద్దు..

ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని నిరుద్యోగులను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు వారి వలలో చిక్కి మోసపోవద్దని కోరారు. సమయం వృథా చేసుకోవద్దని, పొరపాటున కేసులు నమోదైతే.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమాయకులను ఇలాగే రెచ్చగొట్టి బలిదానాలు చేసుకునేలా చేశారని ఆరోపించారు. హరీశ్ రావు రూ.100 పెట్టి పెట్రోల్ బాటిల్ కొనుక్కున్నాడని, పది పైసల అగ్గి పెట్టె దొరకలేదా.. అని ఎద్దేవా చేశారు. విడతల వారీగా ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

Also Read : జూరాల ప్రాజెక్టు పరవళ్లు.. సెల్ఫీల మోజులో పర్యాటకులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>