కలం, జోగులాంబ గద్వాల: ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టు (Jurala Project)కు వరద వస్తుండటంతో ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. డ్యాం అందాలను తిలకించడానికి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ప్రాజెక్టు వెనుకబాగాన కృష్ణా నదిలోకి దిగి ఫొటోలు దిగుతూ ప్రమాదపు అంచు వరకు వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో ప్రాజెక్టులోకి దిగి సెల్ఫీలు దిగుతున్నారు. నదిలో మొసళ్లు ఉన్న ఉన్నాయని పోలీస్ శాఖ హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా నదిలోకి దిగి సందడి చేస్తున్నారు. ప్రాజెక్టు అందాలను తిలకించడం బాగున్నా.. ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితేంటనే ఆందోళన కలుగుతోంది. విహార యాత్ర.. విషాద యాత్ర కావొద్దని, పర్యాటకులను నదిలోకి దిగకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
Also Read : నిర్లక్ష్యానికి నిలయంగా భద్రాచలం ఆస్పత్రి.. రోగులకు నిత్యం నరకం!
Follow Us On: X(Twitter)
మహబూబ్ నగర్ వార్తల కోసం క్లిక్ చేయండి

