కలం, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి(Sangareddy) జిల్లాను చిన్న చూపు చూస్తున్నారని .. ఆ జిల్లాకు నిధులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో హరీశ్ రావు పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుచూపుతో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం(Kaleshwaram) నీటిని తీసుకొచ్చి.. జోగిపేట, ఆందోల్ నియోజకవర్గాల్లో లక్షా యాబై వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ రెండు ప్రాజెక్టులకు కేసీఆర్ రూపకల్పన చేశారని గుర్తు చేశారు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ ప్రాజెక్టులను గాలికి వదిలేశారని హరీష్ రావు విమర్శించారు. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ సోకు కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. అందాల పోటీలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులు నిర్మించేందుకు డబ్బులు ఉండవా? అని ప్రశ్నించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ (Zaheerabad) వచ్చి ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా? అని హరీష్ రావు ప్రశ్నించారు.
స్థానిక నేతలు ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించడం లేదని హరీశ్ రావు(Harish Rao) నిలదీశారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్లన్నీ గుంతల మయం అయినా పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. వృద్ధులకు 4 వేల పింఛన్, ఆడబిడ్డలకు నెలకు 2 వేలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు.
Read Also: నాంపల్లి కోర్టుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే
Follow Us On: Youtube


