హైదరాబాద్‌కు 3 వేల ఎలక్ట్రికల్ బస్సులు: సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగా నగరంలో త్వరలోనే 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని, పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీ (EV) వాహనాలుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పదేళ్ల పాలనలో మెట్రో విస్తరణను పూర్తిగా విస్మరించిందని, కనీసం అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ కూడా లేకుండా చేశారని విమర్శించారు. పాత ప్రభుత్వం వదిలేసిన అసంపూర్తి పనులను అధిగమిస్తూ, మెట్రో రైలును విస్తరించి నగర రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Read Also: గత ప్రభుత్వ పారిశ్రామిక భూములపై ఎంక్వయిరీ : సీఎం

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>