Mobile Popup Ad
Mobile Popup Ad

రైతన్నకు హ్యాట్సాఫ్.. బడి కోసం లక్షల విలువైన భూమి దానం

కలం, వెబ్ డెస్క్ : పిల్లల చదువు కోసం, గ్రామం భవిష్యత్తు కోసం తనకు ఉన్నదంతా ఇచ్చేశాడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు చెందిన ఓ రైతన్న. ఆ భూమిపై నిర్మించిన పాఠశాలలో వందలాంది మంది విద్యార్థులు చదువుకుని ప్రయోజకులయ్యారు. 70 సంవత్సరాల క్రితం తన సొంత భూమిని పాఠశాల నిర్మాణం కోసం దానం చేసిన ఒక వృద్ధ రైతు నేడు పాఠశాల సిబ్బంది విద్యార్థులు సన్మానించారు. అధికారులు, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు ఆ వృద్ధ రైతను సత్కరించారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ రోజుల్లో భూమి కోసం కోర్టు కేసులు, వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాంటిది 70 ఏళ్ల క్రితం దానం ఇచ్చిన భూమి ఇప్పుడు లక్షల విలువ వచ్చినా ఆ రైతన్న సంతోషంగా ఉన్నాడు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఆ వృద్ధుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>