Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీ బీఫామ్‌లు బీఆర్ఎస్ ఆఫీసులో ఇస్తున్నారు : సీఎం రేవంత్

కలం, డెస్క్ : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కైపోయాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను తట్టుకోలేక ఆ రెండు పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటై పోయాయని చెప్పారు సీఎం రేవంత్. వికారాబాద్ (Vikarabad) జిల్లా నారాయణపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. బీఆర్ ఎస్ పోటీ ఇవ్వలేక బీజేపీని అరువు తెచ్చుకుందని సెటైర్లు వేశారు సీఎం. బీజేపీ అభ్యర్థుల బీ ఫామ్ లు బీఆర్ ఎస్ ఆఫీసులో ఇస్తున్నారని.. అది చూసి తట్టుకోలేక అనేక మంది బీజేపీ లీడర్లు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

పదేళ్లు కేసీఆర్ సీఎంగా, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ (KTR) ఉన్నా.. మున్సిపాలిటీలను ఎలాంటి అభివృద్ధి చేయలేదని సీఎం రేవంత్ విమర్శించారు. ‘కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలో ఉన్నా సరే.. ఎన్నడూ మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీని చూసి ఓటేయాలని అడుగుతున్నారు. పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే పిలగాడు సంసారం చేయకుంటే, కుటుంబాన్ని నడపకుంటే ఎవరిని అడగాలి’ అంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).

Read Also: బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ: కవిత సంచలన ఆరోపణ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>