కలం, నల్లగొండ బ్యూరో : మున్సిపాలిటీలకు సీఎం రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వట్లేదని విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ (MP Laxman). భువనగిరి మున్సిపాలిటీలోనీ పలు వార్డుల్లో బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ లక్ష్మణ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘రేవంత్ రెడ్డి నువ్వు టోపీ పెట్టుకున్నా.. గడ్డం పెంచుకున్న మాకు అభ్యంతరం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) మరోసారి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడు.
దమ్ముంటే రెండేళ్లలో మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారో రేవంత్ రెడ్డి చెప్పాలి’ అని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని, బీజేపీకి ఓటేసి ప్రభుత్వానికి మాత్రం ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ ఎన్నికల వల్ల కొత్త ప్రభుత్వం వచ్చేది లేదు ఉన్నది పడిపోయేది లేదని.. కాబట్టి కాంగ్రెస్ కు ఓటేసి మోసపోవద్దన్నారు లక్ష్మణ్ (MP Laxman). కేంద్రం నుంచే మున్సిపాలిటీ లకు నిధులు వచ్చాయని.. వాటిని గుర్తుంచుకుని ఓటు వేయాలన్నారు ఎంపీ లక్ష్మణ్.
Read Also: లక్ష ఇచ్చాడు.. చిక్కుల్లో పడ్డాడు
Follow Us On: Sharechat


