epaper
Wednesday, February 18, 2026
epaper

ముస్లిం మహిళలకు భరోసా కల్పించిన బీజేపీ : బండి సంజయ్​

కలం, వెబ్​ డెస్క్​ : ముస్లిం మహిళలకు భరోసా కల్పించడానికి ట్రిపుల్‌ తలాఖ్ ను బీజేపీ రద్దు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Bandi Sanjay) తెలిపారు. మున్సిపల్​ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్​ (Karimnagar) లో బండి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ముస్లిం మహిళల సమస్యలపై ఒవైసీ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. త్రిబుల్​ తలాఖ్​ (Triple Talaq) పేరుతో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని అంతం చేస్తే.. కొందరు రాజకీయం కోసం అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

దేశవ్యాప్తంగా ముస్లిం మహిళా లోకం బీజేపీకి జై కొడుతోందని వెల్లడించారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​ పార్టీని గెలిపిస్తే పన్నుల మోత తప్పదంటూ ఓటర్లను హెచ్చరించారు. కరీంనగర్​ కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధుల వరద తీసుకొస్తానని బండి సంజయ్ హామీనిచ్చారు. కరీంనగర్​ లో బీఆర్​ఎస్​ పనైపోయిందన్నారు. మున్సిపల్​ ఎలక్షన్స్​ లో ప్రతిపక్షాల పరిస్థితి దారుణంగా ఉండబోతుందని బండి (Bandi Sanjay) జోస్యం చెప్పారు.

Read Also: మున్సిపాలిటీలకు సీఎం రేవంత్ నిధులివ్వట్లేదు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>