కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు (CM Chandrababu) మే 23న తన సొంత జిల్లా చిత్తూరులో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చేపట్టిన ‘సంజీవని’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు రేపు ఉదయం 11 గంటలకు యాదమర్రి మండలం కండ్రిగ గ్రామానికి చేరుకొనున్నారు. ఆ తర్వాత ప్రజావేదికలో పాల్గొని సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
పర్యటనలో భాగంగా సంతగేటులోని ప్రభుత్వ ఆసుపత్రిని సీఎం సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్ధేశం చేయనున్న సీఎం.. సాయంత్రం 4 గంటలకు అమరావతికి తిరిగి పయనం కానున్నారు. ఇదిలాఉంటే సీఎం చంద్రబాబు యాదమరి మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో నేడు కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ , చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ పర్యటన ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

