తుమ్మలపెంటలో సీఎం చంద్రబాబు సభకు భారీ ఏర్పాట్లు

కలం, వెబ్ డెస్క్ : కావలి (Kavali) నియోజకవర్గంలోని తుమ్మలపెంటలో (Thummalapenta) మత్స్యకార సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు మొత్తం ₹262 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాలలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎం చంద్రబాబు ఉదయం 9:30 గంటలకు అమరావతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 10:30 గంటలకు తుమ్మలపెంటకు చేరుకోనున్నారు. ఈ పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇటీవల మత్స్యకార గ్రామాలలో బోట్ల మిస్సింగ్ ఘటనల తర్వాత ఇది జిల్లాలో జరుగుతున్న తొలి సీఎం సభ కావడం విశేషం. నెలన్నర క్రితం ఇదే తుమ్మలపెంటలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  పర్యటించిన విషయం కూడా గుర్తుచేస్తున్నారు.

Read Also: బోటు మనదే, వేట మనదే.. ఏపీ తీర ప్రాంతాలపై బాబు కీలక వ్యాఖ్యలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>