Mobile Popup Ad
Mobile Popup Ad

92 మంది స్టూడెంట్లకు ఫుడ్ పాయిజన్.. సీఎం చంద్రబాబు సీరియస్

కలం, డెస్క్ : పోలవరం జిల్లాలోని రంపచోడవరం దేవరాపల్లి గిరిజన ఆశ్రమ స్కూల్ లో (Devarapalli Ashram School) 92 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న 80 మందికి, నేడు మరో 12 మందికి ఫుడ్ పాయిజన్ కావడంతో వారిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. వాంతులు, విరేచనాలతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు (Chandrababu) సీరియస్ గా స్పందించారు. సంబంధిత అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు.. అధికారులు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిన్న ఉదయం టిఫిన్ చేసిన తర్వాత నుంచే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ (Food Poisoning) అయినట్టు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.

ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుటపడినట్టు వివరించారు అధికారులు. ఈ ఘటనపై ఇన్ స్పెక్షన్ కమిటీ వేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని.. మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read Also: నా బైక్ కు చలాన్ ఎలా వేస్తారు.. రోడ్డుపై యువకుడి నిరసన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>