Mobile Popup Ad
Mobile Popup Ad

షాకింగ్​.. పార్క్​ చేసిన కారులో మూడు మృతదేహాలు

కలం, వెబ్​డెస్క్​: పార్క్​ చేసిన కారులో మూడు మృతదేహాలు బయటపడడం (Three Bodies Found) కలకలం సృష్టించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పీరాఘర్హి ఫ్లైఓవర్​పై ఓ టయోటా క్వాలిస్​ వాహనం అనుమానాస్పద రీతీలో పార్క్​ చేసి ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులతోపాటు, ఫైర్​ డిపార్ట్​మెంట్​, బాంబు స్క్వాడ్​ సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకున్నారు. కారులో పేలుడు పదార్థాలు ఏవైనా ఉన్నాయేమోనని క్షణ్నంగా తనిఖీ చేశారు. అనంతరం కారు డోర్లు తెరిచారు. లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. అందులో మూడు మృతదేహాలు సీట్లలో కూర్చొని ఉన్న స్థితిలో కనిపించాయి. ఇవి ఒక మహిళ, ఇద్దరు పురుషుల మృతదేహాలు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది.

చనిపోయిన ముగ్గురినీ రణధీర్​ సింగ్​(60), లక్ష్మీ సింగ్​(40), శివ నారాయణ(46)గా పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్​ బృందాలు కారులోని ఆధారాలు సేకరించాయి (Delhi). కాగా, మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటాప్సీ రిపోర్టు తర్వాత మరణాలకు కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: 92 మంది స్టూడెంట్లకు ఫుడ్ పాయిజన్.. సీఎం చంద్రబాబు సీరియస్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>