కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతిలోని రాయపూడి (Rayapudi)లో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఎల్అండ్‌టీ కంపెనీకి చెందిన సామగ్రి భారీ ఎత్తున దగ్ధమైంది. ఇది మరువకముందే మరో అగ్ని ప్రమాదం జరగడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాయపూడిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మెఘా కంపెనీకి చెందిన పైపులు దగ్ధమయ్యాయి.
ఈ రెండు ప్రమాదాల్లో కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అధికారులు ఈ రెండు ఘటనలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబుకు (Chandrababu) వివరించారు. రాజధాని ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడంపై సీఎం అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ప్రమాదమా? లేక కుట్ర కోణం ఉందా? అనే విషయంలో లోతుగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం సీఆర్డీఏ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దీనిపై ఇప్పటికే హోం మంత్రి అనిత పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.
Read Also: మత మార్పిడి విషయంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
Follow Us On : WhatsApp

