Mobile Popup Ad
Mobile Popup Ad

IPL 2026: KKR, SRH జట్లలో కొత్త ప్లేయర్లు

కలం, వెడ్ డెస్క్: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 2026) సమరానికి ఇంకో నాలుగు రోజులే మిగిలి ఉంది. తమ అభిమాన టీమ్ ల నుంచి సిక్సులు, బౌండరీల విధ్వంసాన్ని .. వికెట్ల సునామీలను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానే ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్​యంలో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందించాయి. ఆయా జట్లు తమ కొత్త సభ్యులను ప్రకటించాయి. ఈ మేరకు ఆయా జట్లు గాయపడిన ఆటగాళ్ల స్థానంలో కొత్తవారిని నియమించినట్లు వెల్లడించాయి.

నడుము నొప్పి కారణంగా IPL 2026 సీజన్‌కు దూరమవ్వగా.. అతని స్థానంలో కొత్త వ్యక్తిని కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఎంపిక చేసింది. సౌరభ్ దూబేను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అటు పాదం గాయంతో దూరమైన జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో డేవిడ్ పెయిన్ ను ఎంపిక చేసినట్లు SRH యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు సౌరభ్ దూబే ను రూ.30 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తీసుకుంది. అయితే డేవిడ్ పెయిన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఏకంగా రూ.1.5 కోట్లు వెచ్చించింది. సౌరభ్ విదర్భ తరపున ఆడుతూ.. ఐపీఎల్‌లో తొలిసారి అరంగేట్రం చేయనున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తొలి మ్యాచ్ ఆడనుంది. 2016 ఫైనల్ ప్రత్యర్థుల మధ్య జరగనున్న ఈ పోరుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇరు జట్ల మధ్య హోరాహోరి పోరు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌(MI) తో ఆడనుంది. అజింక్య రహానే కెప్టెన్సీలో ఈ సీజన్‌లో బరిలోకి దిగుతున్న కేకేఆర్, తన మొదటి మ్యాచ్‌లో గెలుపుతో బోణీ కొట్టాలని యోచిస్తోంది.

Read Also: ఈషాన్ మలింగకు గ్రీన్ సిగ్నల్.. పతిరానా, హసరంగకు వెయిటింగ్!

Follow Us On: Pinterest

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>