పారిశ్రామిక క్లస్టర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ప్రొడెక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు విశాఖ ఎకనమిక్ రీజియన్, అమరావతి ఎకనమిక్ రీజియన్, తిరుపతి ఎకనమిక్ రీజియన్ పారిశ్రామిక క్లస్టర్లపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ తలపెట్టిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం( భవ్య పథకం) కింద పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై చర్చించారు. అలాగే ఈ సమావేశంలో 2026-27లో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్క్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, కంటైనర్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ సహా 175 ఎంఎస్ఎంఈ పార్కులను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసే అంశంపై అధికారులతో చర్చించారు.

పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు వేలల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే స్థానిక పరిసర ప్రాంతాల్లో చిన్నాచితకా వ్యాపారాలు సైతం వృద్ధి చెందుతాయి. పన్నుల రాబడి పెరగటంతో రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది. ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పరిశ్రమలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాలు, అటవీ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: అభివృద్ధి రథచక్రాల కింద సమిదలవుతున్న వృక్షాలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>