Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీ విజయోత్సవంలో ‘ఝల్‌మురి’ సర్వింగ్

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమబెంగాల్ (West Bengal) ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ‘ఝల్‌మురి’ (Jhalmuri) రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు పక్కన ఝల్‌మురి తినడాన్ని ‘స్క్రిప్టెడ్ డ్రామా’ గా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, పశ్చిమబెంగాల్ ఎన్నికలలో బీజేపీ భారీ విజయం సాధించడంతో కేంద్ర పార్టీ కార్యాలయంలో ‘ఝల్‌మురి’ (Jhalmuri) పంపిణీ జరిగింది. పార్టీ శ్రేణులకు ఝల్‌మురీని అల్పాహారంగా వడ్డించడంతో మమతా బెనర్జీ వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. బీజేపీ ఈ కార్యక్రమాన్ని విజయోత్సవంగా నిర్వహించగా, ఇది రాజకీయంగా కొత్త చర్చలకు దారితీసింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>