కలం, వెబ్ డెస్క్: ఏపీలో కమ్యూనికేషన్ నెట్వర్క్‌పై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనికేషన్ నెట్వర్క్‌ను మరింత బలోపేతం చేసే అంశాలపై సర్వీసు ప్రొవైడర్లతో సుదీర్ఘంగా చర్చించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం సెల్ టవర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్ కవరేజ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
వాట్సాప్ గవర్నెన్సు, మనమిత్ర లాంటి మొబైల్ యాప్ సహా డిజిటల్ లిటరసీ పెంచటంలో సహకారం అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, బీఎస్ఎన్ఎల్, జియో, వోడాఫోన్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
అటు రాష్ట్ర గనుల శాఖ సంబంధిత అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమీక్షించారు. మినరల్ వెల్త్‌పై మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్‌తో పాటు విలువైన లోహాలు లభ్యం అయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు.
బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము లాంటి ఖనిజాల వ్యాల్యూ అడిషన్ ద్వారా గరిష్టంగా రెవెన్యూను సంపాదించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, గనుల శాఖ, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: ఫ్యాన్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్లే పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం!
Follow Us On: Instagram

