కలం, వెబ్ డెస్క్ : ప్రజల కష్టాలు తీర్చే పవర్ హౌస్ లా పంచాయతీరాజ్ వ్యవస్థ మారాలి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి కె. వెంకటకృష్ణ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ విజన్ లేని పాలన వల్లే పంచాయతీల వ్యవస్థ దెబ్బ తిన్నదని ఆరోపించారు.
కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా రూ.4,200 కోట్లు బదిలీ చేసినట్లు ఆయన (Pawan Kalyan) వెల్లడించారు. వ్యవస్థలు బలంగా నడవాలంటే ఉద్యోగుల పాత్రే కీలకం అని పవన్ నొక్కి చెప్పారు. ‘ప్రజల కోసం మీరు ఒక అడుగు వేస్తే… మీ కోసం నేను వంద అడుగులు వేస్తా’ అని అధికారులకు పవన్ కల్యాణ్ భరోసానిచ్చారు.
మనం చేసే ప్రతి పనిలో పారదర్శకత ఉండాలని సూచించారు. వెంకట కృష్ణ లాంటి అధికారుల వల్లే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో వెంకట కృష్ణ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని పవన్ తెలిపారు.
Read Also: నిన్న బాధ్యతల స్వీకరణ.. నేడు రిటైర్మెంట్!
Follow Us On: X(Twitter)

