కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ పిలుపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) తన కాన్వాయ్ తగ్గించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. నేటి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే సీఎం చేరుకున్నారు. అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకున్నారు.
Read Also: బండి సంజయ్ కొడుకు రేవంత్ ఇంట్లోనే ఉన్నాడు: బక్క జడ్సన్
Follow Us On: Sharechat

